5/8/18

ట్రిపుల్‌ ఐటీ IIIT Openings 2018 – Apply Online నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో 4 వేల సీట్లు భర్తీ

ట్రిపుల్‌ ఐటీ IIIT Openings 2018 – Apply Online నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో 4 వేల సీట్లు భర్తీ

ట్రిపుల్‌ ఐటీ పిలుస్తోంది.. నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో 4 వేల సీట్లు భర్తీ వచ్చే నెల 8లోగా దరఖాస్తు చేసుకోవాలి

ట్రిపుల్‌ ఐటీ… గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రభుత్వం చూపిన ఉన్నత చదువులకు ప్రధాన ద్వారం. ప్రస్తుతం అవి ఆహ్వానం పలుకుతున్నాయి.

రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలో ఏర్పాటు చేసిన శ్రీకాకుళం, ఒంగోలు, నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్‌ విద్య అభ్యసించడానికి ఆదివారం ప్రకటన విడుదలైంది.

వచ్చే నెల 8లోగా అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. మరి ప్రవేశాలు ఎలా ఉంటాయి, ఎలాంటి కోర్సు అందిస్తారు, ఏ ప్రాతిపదికన ప్రవేశాలు కల్పిస్తారో ఒక్కసారి చూద్దాం.

ప్రవేశాలు ఇలా

పదో తరగతిలో విద్యార్థులు సాధించిన గ్రేడు పాయింటు యావరేజ్‌ (జీపీఏ) ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. నాలుగు ట్రిపుల్‌ఐటీల్లో వెయ్యి మంది చొప్పున 4 వేల మంది విద్యార్థులకు ప్రవేశాలకు అవకాశం ఉంది.

వీటిల్లో 85 శాతం సీట్లు ఆయా విశ్వవిద్యాలయాల పరిధిలో వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు, మిగిలిన 15 శాతం సీట్లు ఓపెన్‌ విభాగంలో ప్రతిభ ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారిని ఎంపిక చేస్తారు.

-> అర్హతలు :-

2018లో ఎస్‌ఎస్‌సీ లేదా తత్సమాన అర్హత పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

అభ్యర్థుల వయస్సు 31.12.18 నాటికి 18 ఏళ్లు దాటరాదు. (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 21 ఏళ్లు)
ఇంటర్మీడియట్‌తో పాటు నాలుగేళ్ల ఇంజినీరింగ్‌ విద్య మొత్తంగా ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్‌ విద్య ట్రిపుల్‌ ఐటీల్లో అందజేస్తారు. రెండేళ్లు గణితం, భౌతిక, రసాయనశాస్త్రాలను బోధిస్తారు. ఈ రెండేళ్ల చదువు ఇంటర్మీడియట్‌కు సమానంగా ఉంటుంది. ఈ రెండేళ్ల చదువులో విద్యార్థులకు వచ్చిన మార్కులను అనుసరించి సామాజిక వర్గాల రిజర్వేషన్‌ ఆధారంగా ఇంజినీరింగ్‌లో శాఖలను విద్యార్థులకు కేటాయిస్తారు.

->  ఈ పత్రాలు అవసరం :-అభ్యర్థులు తమ ప్రవేశాల సమయంలో ప్రవేశాలను కోరుతూ ధరఖాస్తు చేసిన సమయంలో తీసుకున్న ప్రింటౌవుట్‌ కాపీలు, ఏపీ ఆన్‌లైను రశీదులు, పదో తరగతి హాల్‌టిక్కెట్‌, పదో తరగతి మార్కుల మెమో, నివాస, కుల, ధ్రువీకరణ పత్రాలుండాలి. వికలాంగులు, సైనికుల పిల్లలు, ఎన్‌సీసీ, క్రీడలు విభాగాల్లో ఎంపికయ్యే అభ్యర్థులు వాటికి సంబంధించిన ధ్రువపత్రాలు సమర్పించాల్సింటుంది.

-> ఇదీ షెడ్యూల్‌ :-

నాలుగు ట్రిపుల్‌ఐటీలకు ఒకే దరఖాస్తు ఉంటుంది. ఏపీ ఆన్‌లైను ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.150లు, ఎస్సీ, ఎస్టీలు రూ.100లు చెల్లించాలి. అదనంగా రూ.25లు ప్రాసెసింగ్‌ రుసుము ఉంటుంది.

నాలుగు ట్రిపుల్‌ ఐటీలకు ప్రాధాన్యతను చూపుతూ ఒకే దరఖాస్తు చేయొచ్చు.

ప్రత్యేక విభాగం వారు మాత్రమే తమ రిజర్వేషన్ల ప్రింటవుట్లు, ధ్రువీకరణ పత్రాలను జిరాక్సు తీసి వాటిపై విద్యార్థి సంతకంతో పంపాలి.

ఎంపికైన అభ్యర్థుల జాబితాను విశ్వవిద్యాలయం అంతర్జాలంలో వెల్లడిస్తారు. విద్యార్థుల ఈ-మెయిల్‌, చరవాణీలకు సంక్షిప్త సందేశం పంపుతారు.

అంతర్జాలంలో వచ్చే నెల 8లోగా అభ్యర్థులు దరఖాస్తు చేయాలి.

వికలాంగ, సైనిక, ఎన్‌సీసీ, క్రీడల కోటాలో దరఖాస్తు చేసే అభ్యర్థులు అంతర్జాలంలో దరఖాస్తు చేసిన ప్రింటవుట్‌ కాపీలను వచ్చే నెల 8లోగా విశ్వవిద్యాలయానికి పంపాలి. మిగులు అభ్యర్థులు పంపాల్సిన అవసరం లేదు.

ప్రత్యేక కేటగిరి అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలన వచ్చే నెల 16, 17 తేదీల్లో నూజివీడులో చేపడతారు.

ప్రత్యేక విభాగాలు మినహా ఇతర అభ్యర్థుల ప్రొవిజనల్‌ సెలెక్టెడ్‌ జాబితాను వచ్చే నెల 26న ప్రకటిస్తారు.

మొదటి విడతలో నూజివీడు అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన, ప్రవేశాలు జులై 4, 5 తేదీల్లో నూజివీడులో జరుగుతుంది. ఇవే తేదీల్లో కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన, ప్రవేశాలుంటాయి.

జులై 6, 7 తేదీల్లో ఒంగోలు ట్రిపుల్‌ఐటీకి ఎంపికైన అభ్యర్థులకు ఇడుపాలపాయ ప్రాంగణంలోని ఒంగోలు క్యాంపస్‌లో ధ్రువపత్రాల పరిశీలన, ప్రవేశాలుంటాయి. ఇదే తేదీల్లో శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీకి ఎంపికైన వారికి నూజివీడు ట్రిపుల్‌ఐటీ ప్రాంగణంలో ధ్రువపత్రాల పరిశీలన, ప్రవేశాలుంటాయి.ట్రిపుల్‌ఐటీలో ప్రత్యేక కోటాలో ఎన్‌సీసీ, క్రీడలు, వికలాంగులు, సైనికుల పిల్లలు ఎంపిక జాబితాను జులై 15న ప్రకటిస్తారు. వీరికి జులై 20, 21, 23, 24 తేదీల్లో నూజివీడు ట్రిపుల్‌ఐటీలో ధ్రువపత్రాల పరిశీలన, ప్రవేశాలు కల్పిస్తారు.

ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభిస్తారు.

Related Posts

0 comments:

Post a Comment

AP, TS Employees, Teachers Info

  New PRC
  AP
  TS
  GPF SLIPS
  AP
  TS
  GLI Bonds/Slips
  CPS/PRAN
  AP
  TS
  GIS
  AP
  TS
  ALLOWENCES
  AP
  TS
  DEPT TESTS
  AP
  TS
  MED.REIMBMNT
  AP
  TS
  SALARY CERIFICATE
  AP
  TS
  PENSION
  AP
  TS
  Health Cards
  AP
  TS

   JOBS Latest Info

   More
   Top